Tuesday, February 14, 2017

సాపాటు ఎటూ లేదు

చిత్రం : ఆకలి రాజ్యం (1980)
సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు 




పల్లవి :


హే హే హే హే హే హే హేహే ఏ ఏహే
రు రు రు రు రూరు రూ రూ రురు





సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే...  బ్రదర్



సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే...  బ్రదర్




చరణం 1 :



మన తల్లి అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా.. తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా 


మన తల్లి అన్నపూర్ణ.. మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా.. తమ్ముడూ
మన కీర్తి మంచు కొండరా 


డిగ్రీలు తెచ్చుకొని చిప్ప చేత పుచ్చుకొని
ఢిల్లీకి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్




సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే...  బ్రదర్




చరణం 2 :



బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా


ఈ పుణ్య భూమిలో పుట్టడం మన తప్పా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా


ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా... ఆ.. ఆ..
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా
గంగలో మునకేసి కాషాయం కట్టెయ్ బ్రదర్


సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్




చరణం 3 : 



సంతాన మూలికలము సంసార బానిసలము
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు... సంపాదనొకటి కరువురా



చదవెయ్య సీటు లేదు... చదివొస్తే పనీ లేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టే దిక్కే లేదు
దేవుడిదే భారమని పెంపు చేయరా బ్రదర్





సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే...  బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కుడా పెళ్లి లాంటిదే...  బ్రదర్


Sunday, February 12, 2017

What are the 10 things that every Indian should know?

Few amazing things about India-
1. Water on moon was revealed by India
- In the year 2009 India's ISRO Chandrayaan- 1 utilizing its Moon Mineralogy Mapper identified water on the moon for the first time.
2. English speaking country
- India is second largest English speaking country in the world, 10% of Indians can speak in English which is about 125 million people.
3. C.N.Annadurai’s Funeral
- It was attended by 15 million people on the streets on Chennai.
4. India is the birth place of
- Ayurveda, Yoga, Martial Art,Surgery, Zero, Calculus, Geometry and Trigonometry.
5. City Montessori School in Lucknow
- 45K students and world’s largest school in terms of students.
6. Indian Railways
- Indian Railways has total 1.4 million staffs which are equal to the whole inhabitants of many countries such as Trinidad and Tobago, Estonia, Mauritius, Bahrain, Cyprus, Luxembourg, Iceland, Liechtenstein, Monaco etc.
7. Freddie Mercury and Ben Kingsley are both of Indian ancestry
- Freddie Mercury was born as Parsi with the name Farrokh Bulsara
- Hollywood star Ben Kingsley was born as Krishna Pandit Bhanji.
8. Dahala Khagrabari
- It was part of India till 2015. This area was located with the territorial limits of Bangladesh.
- On 6 May 2015, India ratified the Land Boundary Agreement and decided to concede the enclave to Bangladesh.
Dahala_Khagrabari
9. 300,000 mosques in India
- There are More 300K mosques in India which is more than any country in this world.
10. Fourth most powerful Army
-India has the world’s fourth most powerful army after China,Russia and US. Also, India is one of the biggest troop contributor in UN peacekeeping missions since its starting.
Knowledge Courtesy - Google

Friday, February 3, 2017

నిన్ను తలచి మైమరచా from విచిత్ర సోదరులు (1989) Telugu Song Lyrics

చిత్రం :  విచిత్ర సోదరులు (1989)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  రాజశ్రీ
నేపధ్య గానం :  బాలు 




పల్లవి :


నిన్ను తలచి మైమరచా...  చిత్రమే..  అది చిత్రమే
నిన్ను తలచి మైమరచా...  చిత్రమే..  అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ...  ఈ భూమి చేరదని
నాడు తెలియదులే... ఈ నాడు తెలిసెనులే


ఓ చెలీ... నిన్ను తలచి మైమరచా...  చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే  




చరణం 1 :

ఆడుకుంది నాతో..జాలిలేని దైవం..
పొందలేక నిన్ను..ఓడిపోయె జీవితం


జోరు వానలోన...  ఉప్పునైతి నేనే
హోరు గాలిలోన... ఊకనైతి నేనే..


గాలి మేడలే కట్టుకున్నా..చిత్రమే...  అది చిత్రమే..
సత్యమేదో తెలుసుకున్నా..చిత్రమే...  అది చిత్రమే..
కథ ముగిసెను కాదా... కల చెదిరెను కాదా..
అంతే..... 


నిన్ను తలచి మైమరచా...  చిత్రమే..  అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే



చరణం 2 :

కళ్ళలోన నేను... కట్టుకున్న కోట
నేడు కూలిపొయే... ఆశ తీరు పూత..
కోరుకున్న యోగం... జారుకుంది నేడు..
చీకటేమో నాలో... చేరుకుంది చూడు..


రాసి ఉన్న తల రాత తప్పాడు... చిత్రమే...  అది చిత్రమే..
గుండె కోతలే నాకు ఇప్పుడు... చిత్రమే...  అది చిత్రమే..
కథ ముగిసెను కాదా... కల చెదిరెను కాదా..
అంతే... 


నిన్ను తలచి మైమరచా...  చిత్రమే..  అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే
ఆ నింగినెన్నటికీ...  ఈ భూమి చేరదని
నాడు తెలియదులే... ఈ నాడు తెలిసెనులే



ఓ చెలీ... నిన్ను తలచి మైమరచా...  చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా...  చిత్రమే..  అది చిత్రమే  


Thursday, February 2, 2017

చెప్పాలని ఉంది Telugu Song Lyrics

చిత్రం : రుద్రవీణ (1988)
సంగీతం :  ఇళయరాజా
గీతరచయిత :  సిరివెన్నెల
నేపధ్య గానం :  బాలు, మనో


పల్లవి :


ఒంటరిగా దిగులు బరువు మోయబోకు నేస్తం
మౌనం చూపిస్తుందా సమస్యలకు మార్గం
కష్టం వస్తేనే గద గుండె బలం తెలిసేది
దు:ఖానికి తలవంచితే తెలివి కింక విలువేది
మంచైనా చెడ్డైనా పంచుకోను మేలైన
ఆ మాత్రం ఆత్మీయతకైనా పనికిరానా
ఎవ్వరితో ఏ మాత్రం పంచుకోను వీలులేని
అంతటి ఏకాంతమైన చింతలేమిటండి



చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది


గుండెల్లో సుడి తిరిగే కలత కథలూ
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది 


చరణం 1 :


కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని
కోకిలల కుటుంబంలో చెడ బుట్టిన కాకిని అని
అయినవాళ్ళు వెలివేస్తే అయినా నేనేకాకిని


చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది


పాట బాట మారాలని చెప్పటమేనా నేరం
గూడు విడిచి పొమ్మన్నది నన్ను కన్న మమకారం
వసంతాల అందం విరబుసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట
వసంతాల అందం విరబుసే ఆనందం
తేటి తేనె పాట పంచెవన్నెల విరితోట


బ్రతుకు పుస్తకంలో ఇది ఒకటేనా పుట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట
మనిషి నడుచు దారుల్లో లేదా ఏ ముళ్ళబాట


చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది



చరణం 2 :


ఏటి పొడుగునా వసంతమొకటేనా కాలం
ఏదీ మరి మిగతా కాలాలకు తాళం
నిట్టూర్పుల వడగాలుల శృతిలో ఒకడు
కంటి నీటి కుంభవృష్టి జడిలో ఇంకొకడు
మంచు వంచెనకు మోడై గోడు పెట్టు వాడొకడు
వీరి గొంతులోని కేక వెనుక ఉన్నదే రాగం
అనుక్షణం వెంటాడే ఆవేదన ఏ నాదం
అని అడిగిన నా ప్రశ్నకు అలిగి మత్త కోకిల


కళ్ళు ఉన్న కబోదిలా చెవులు ఉన్న బధిరుడిలా
నూతిలోని కప్పలా బ్రతకమన్న శాసనం
కాదన్నందుకు అక్కడ కరువాయెను నా స్థానం


చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది
చెప్పాలని ఉంది గొంతు విప్పాలని ఉంది


చరణం 3 : 


అసహాయతలో దడ దడ లాడే హృదయమృదంగ ధ్వానం
నాడుల నడకల తడబడి సాగే అర్తుల ఆరని శోకం
ఎడారి బతుకుల నిత్యం చస్తూ సాగే బాధల బిడారు
దిక్కు మొక్కు తెలియని దీనుల యదార్థ జీవన స్వరాలు


నిలువునా నన్ను కమ్ముతున్నాయి శాంతితో నిలువనీయకున్నాయి
ఈ తీగలు సవరించాలి ఈ అపశృతి సరిచెయ్యాలి
జన గీతిని వద్దనుకుంటూ నాకు నేనే హద్దనుకుంటూ
కలలో జీవుంచను నేను కలవరింత కోరను నేను


నేను సైతం విశ్వవీణకు తంతినై మూర్ఛనలుపోతాను
నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చి మోస్తాను
నేను సైతం ప్రపంచాధ్యపు తెల్ల రేకై పల్లవిస్తాను
నేను సైతం నేను సైతం...  బ్రతుకు బాటకు గొంతు కలిపేను
నేను సైతం నేను సైతం...  బ్రతుకు బాటకు గొంతు కలిపేను


సకల జగతిని శాశ్వతంగా వసంతం వరియించుదాకా
ప్రతి మనిషికి జీవనంలో నందనం వికసించుదాకా
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను
పాత పాటను పాడలేను కొత్త బాటను వీడిపోను


నేను సైతం..  నేను సైతం..  నేను సైతం
నేను సైతం..  నేను సైతం..  నేను సైతం


Wednesday, February 1, 2017

అమెరికా వీసాలివే :~

అమెరికా వెళ్లే వారికి.. ఆ వ్యక్తి పనిని బట్టి, అక్కడ ఉండే కాలపరిమితిని బట్టి వీసాలు మంజూరు చేస్తుంటారు. ఒక్కోరకం వీసాకి ఒక్కో ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. ఇంతకీ ఎక్కువ మంది జనాలకు తెలియని రకరకాల వీసాలేంటో ఓ లుక్కేద్దాం.




బి-1 వీసా: అమెరికాలో బహుమతులు అందుకోవటానికి, కాన్ఫరెన్స్‌లకు వెళ్లే వారు, క్రీడల్లో పాల్గొనటానికి వెళ్లే వారికి బి-1 వీసాను మంజూరు చేస్తారు. వ్యాపార పనుల నిమిత్తం అమెరికాకు వెళ్లే వారికి ఈ కేటగిరీ వీసానే మంజూరు చేస్తారు.

బి-2 వీసా: దీన్నే విజిటర్‌ వీసా లేదా టూరిస్ట్‌ వీసా అని కూడా అంటారు. అమెరికాను చూడటానికి, అక్కడ విశ్రాంతి తీసుకోవటానికి, బంధుమిత్రులతో గడపటానికి వెళ్లాలంటే బి-2 కేటగిరీ వీసాను పొందాల్సిందే. దీంతోపాటు సోషల్‌ సర్వీస్‌ ఈవెంట్స్‌లో పాల్గొనేవారు, రెమ్యూనరేషన్‌ తీసుకోకుండా ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు, క్రీడాకారులకు ఈ వీసాను ఇస్తారు.

సి- వీసా: అమెరికా మీదుగా మరొక దేశానికి వెళ్లాలంటే ఈ వీసా ఉండాలి.

డి- వీసా: అమెరికాలోని విమానాల్లో లేదా నౌకల్లో పనిచేసే బృందంలో ఉద్యోగిగా జాయిన్‌ కావాలంటే డి- వీసా పొందాలి,

ఎఫ్‌-1 వీసా: ఇది విద్యార్థులకు సంబంధించిన వీసా. అమెరికాలో అకడమిక్‌ కోర్సుల్లో చదువుకోవాలనుకునే వారు ఈ వీసాను పొందాలి.

హెచ్‌-1బి వీసా: అమెరికాలో తాత్కాలిక ఉద్యోగం చేయాలనుకునేవారు ఈ వీసాను తీసుకోవాల్సిందే. ఇక అమెరికాలో పర్మినెంట్‌, ప్రభుత్వ సంబంధిత ఉద్యోగాలు చేయాలంటే గ్రీన్‌కార్డు హోల్డర్‌ అయి ఉండాలి. అద్భుతమైన పరిజ్ఞానం అవసరమయ్యే స్పెషాలిటీ ఆక్యుపేషన్స్‌లో పని చేసేవారికి మాత్రమే ఈ వీసాను ఇస్తారు. అమెరికాలో పిటిషన్‌ అమోదం ఉంటేనే ఇండియా నుంచి అక్కడికి వెళ్లే అవకాశం ఉంది.

జె వీసా: ఎక్చ్సేంజ్‌ విజిటర్లకు ఈ వీసాలు ఇస్తారు.

ఎల్‌ వీసా: ఇండియాలోని బహుళజాతి సంస్థలు అమెరికాలోని తన కంపెనీల్లో ఉద్యోగం చేయటానికి తీసుకుంటే, ఆ ఉద్యోగి ఈ వీసాను తీసుకోవాల్సిందే.

ఎమ్‌-1 వీసా: వృత్తి విద్యా సర్టిఫికేషన్లు పొందేవారికి ఈ వీసా అవసరం.

ఓ- వీసా: టెలివిజన్‌, సినిమా, లలిత కళలు, క్రీడలు, శాస్త్రవిజ్ఞానానికి సంబంధించిన వారు వెళ్లటం కోసం ఓ వీసా తీసుకోవాలి.

పి-1 వీసా: అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న కళాకారులు, క్రీడాకారులు ఈ వీసా కోసం అప్లై చేస్తారు.

పి-2 వీసా: ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకునే ఏర్పాటు కింద కళాకారులకు వెల్‌కమ్‌ చెబుతుంటుంది. ఇలా అమెరికాకి వెళ్లే కళాకారులకు పి-2 వీసా ఉండాలి.

పి-3 వీసా: కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌లో ప్రదర్శనలు ఇవ్వటానికి వెళ్లే ఆర్టిస్టులు, కళాకారులకి ఈ వీసా అవసరం.

ఆర్‌- వీసా: మతసంబంధమైన విషయాలకోసం వెళితే ఆర్‌-వీసా ఉండాలి.

Good Afternoon..

Monday, January 30, 2017

జాబిలికి వెన్నెలకి telugu song Lyrics

జాబిలికి వెన్నెలకి   చిత్రం : చంటి (1992) సంగీతం : ఇళయరాజా గీతరచయిత : వేటూరి నేపధ్య గానం : బాలు

పల్లవి :


జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే


ముద్దులోనే పొద్దుపోయే 

కంటి నిండా నిదరోవే 

చంటి పాడే జోలలోనే


జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే
గంగలలో తేనెలలో కడిగిన ముత్యములే


చరణం 1 :



కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ
కన్నతల్లి ప్రేమ కన్నా అన్నమేది పాపలకీ
అమ్మ ముద్దు కన్న వేరే ముద్ద లేదు ఆకలికీ


దేవతంటి అమ్మ నీడే కోవెలే బిడ్డలకి
చెమ్మగిల్లు బిడ్డ కన్నే ఏడుపే అమ్మలకి
అమ్మ చేతి కమ్మనైన దెబ్బ కూడా దీవెనా
బువ్వ పెట్టి బుజ్జగించే లాలనెంతో తియ్యన


మంచు కన్నా చల్లనైనా 

మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా
మల్లె కన్నా తెల్లనైన అమ్మ పాటే పాడుకోనా

Sunday, January 29, 2017

సన్నజాజి పడకా Telugu Song Lyrics

చిత్రం :  క్షత్రియపుత్రుడు  (1992)
సంగీతం : ఇళయరాజా
గీతరచయిత : వెన్నెలకంటి
నేపధ్య గానం : బాలు, జానకి




పల్లవి  :


సన్నజాజి పడకా... మంచ కాడ పడకా..
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే
సన్నజాజి పడకా మంచ కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే


అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే



మనసులో ప్రేమే ఉంది...  మరువని మాటే ఉంది
మాయనీ ఊసేపొంగి పాటై రావే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే 





చరణం 1 :



కొండమల్లి పూవులన్నీ గుండెల్లో నీ నవ్వులన్ని
దండే కట్టి దాచుకున్న నీ కొరకే
పండు వెన్నెలంటి ఈడు ... యెండల్లొన చిన్నబోతే
పండించగ చెరుకున్న నీ దరికి


అండ దండ నీవేనని...  పండగంత నాదేనని
ఉండి ఉండి ఊగింది నా మనసే
కొండపల్లి బోమ్మా ఇక పండు చెండు దోచెయ్యనా
గుండే పంచే వెళ్ళయినది రావే
దిండే పంచే వెళ్ళయినది రావే


సన్నజాజి పడకా...  మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే



సన్నజాజి పడకా...  మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే


అడిగితే సిగ్గేసింది సిగ్గులో మొగ్గేసింది
మొగ్గలా బుగ్గే కంది పోయేనే
సన్నజాజి పడకా మంచె కాడ పడకా...  చల్ల గాలి పడకా
మాట వినకుంది ఎందుకే