Wednesday, July 13, 2016

పట్టు వస్త్రాలపై మరకలు తీసే పద్దతులు..!



  • రక్తం : వేడి నీటిలో జాడించి, కొన్ని చుక్కల అమోనియాను 10 సి.సి.ల హైడ్రోజన్ పెరాక్సైడ్‌తో కలిపి మరకల మీద పూసి ఉతకాలి.
  • పెరుగు, వెన్న : ఒక చుక్క కార్బన్ టెట్రాక్లోరైడ్‌ని ఉపయోగించాలి.
  • చాక్‌లేట్ : వేడి నీటిలో జాడించి ఉతకాలి.
  • కాఫీ లేదా టీ : వస్త్రాలను ఆరనివ్వాలి. కార్బన్ టెట్రాక్లోరైడ్ ను పూసి మరకపోనట్లయితే కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను కలిపిన వేడి నీటిలో ఉతకాలి.
  • కాస్మెటిక్ : బార్ సబ్బుతో రుద్ది జాడించి ఉతకాలి.
  • ఇంక్ లేదా లిప్‌స్టిక్ : మరకైన చోట పేపర్ టవల్‌ను ఉంచి వెనుక భాగాన డ్రైక్లీనింగ్ ద్రావణం లేదా ఆల్కహాల్‌ను పూయాలి. మరక తొలిగే వరకు నీటిని ఉపయోగించరాదు.
  • గోళ్ళరంగు : అసిటోన్‌ను వాడాలి.
  • క్రీం ( ఐస్ - పాలు ) : కార్బన్ టెట్రా క్లోరైడ్ పూసి వేడినీటిలో ఉతకాలి.
  • గుడ్డు : చల్లని నీటితో తుడవాలి.
  • పళ్ళరసాలు : ఆల్కలీ, ఆల్కహాలును సమభాగాల్లో తీసుకొని తుడుచి ఉతకాలి.
  • గ్రీజు మరకలు : టాల్కం పౌడరును మరక మీద వేసి దాన్ని మరక కిందిభాగాన అంటేలా పేపరు టవలు మీద ఉంచి డ్రైక్లీనింగ్ ద్రావణంతో తుడవాలి. జాడించి ఉతికి ఇస్త్రీ చేయాలి.
  • యంత్రం నూనె : మరకలను పీల్చేగుణమున్న పేపరుతో కప్పి రుద్దాలి. కార్బన్ టెట్రాక్లోరైడ్‌ను ఉపయోగించి మరకలను తొలగించాలి.
  • మట్టి : వస్త్రాలను ఆరనిచ్చి కార్బన్ టెట్రాక్లోరైడ్ తో తుడిచి ఉతకాలి.
  • రంగులు : వేడినీటితో జాడించి ఉతకాలి. మరక పోవాలంటే టర్పెంటైన్, కిరోసిన్ తో తుడిచి జాడించి ఉతకాలి.
  • వార్నిష్ నూనె : కార్బన్ టెట్రాక్లోరైడ్ తో తుడవాలి.
  • చెమట : తక్కువ ఘాడత కల హైడ్రాక్లోరిక్ ఆమ్లంలో జాడించి ఉతకాలి.
  • బూట్ పాలిష్ : ఎక్కువ గల పాలిష్‌ను తొలగించాలి. ద్రావణ డిటర్జెంట్ తో రుద్ది తర్వాత ఆల్కహాల్ పూయాలి.
  • వైన్ లేదా శీతల పానీయాలు : చల్లని నీటిలో జాడించి ద్రావణ డిటర్జెంట్ ను ఉపయోగించి వేడినీటితో ఉతకాలి.

No comments:

Post a Comment