- ఇష్టపడి కొనుక్కున్న జీన్స్ రంగుమారకుండా ఉండాలంటే, అరబక్కెట్ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల వెనిగర్ వేయాలి. ఈ నీటిలో దుస్తుల్ని కొద్ది సేపు నానబెట్టి ఆ తర్వాత ఉతకాలి.
- ఊలు, సిల్కు బట్టలు గోరువెచ్చటి నీటిలో పిండిన తరువాత ఒక కాటన్ టవల్లో ఉంచి రోల్ చేస్తే టవల్ వాటి తడిని పీల్చుకుంటుంది. తర్వాత ఆరేయాలి.
- ఐరన్ బాక్స్ అడుగున కొద్దిగా పారాఫిన్ రాస్తే గంజిపెట్టిన బట్టలు అతుక్కోకుండా ఉంటాయి.
- ఒక టేబుల్ స్పూను నిమ్మ చెక్కల పొడిని వాషింగ్ పౌడర్ లో కలిపి బట్టలు ఉతికితే బట్టలు తెల్లగా ఉంటాయి.
- క్లాత్ పై గమ్ అతుక్కుంటే కొద్ది సేపు ఐసుముక్కను క్లాత్ పై ఉన్న గమ్ పై ఉంచి ఆ తర్వాత గీరేస్తే గమ్ ఊడిపోతుంది.
- గోడకు కొట్టిన మేకుకి బట్టలు తగిలించి తీసేటప్పుడు హడావిడిగా లాగితే చిరిగే ప్రమాదం ఉంది. ఆ మేకులో రబ్బరు కాని, స్పాంజ్ కాని గుచ్చి ఉంచితే బట్టలు చిరగవు.
- చేతితో ఎంబ్రాయిడరీ చేసేటప్పుడూ దారపు ఉండని చిన్నకప్పులో వేసి కుట్టుకుంటే దారం ఎక్కడికో వెళ్ళటం, వెతుక్కోవటం ఉండదు.
- తుప్పుపట్టిన తీగలపై బట్టలు ఆరేసినప్పుడు లేదా బట్టలకు ఉన్న హుక్స్ తుప్పు పడితే, బట్టలకు తుప్పు మరకలు అవుతాయి. ఆ తుప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మ తొక్కలతో గానీ ఉప్పు కలిపిన నిమ్మరసంతో గానీ రుద్ది ఎండలో వేయాలి.
తెల్లని బట్టమీద కూర మరకలు పడితే ఆ మరక మీద తెల్లని టూత్ పేస్టు కొంచెం రాసి నీటిలోఉంచి తడిపి ఉతికి ఆరేస్తే మరక పోతుంది.- తెల్లని బట్టలపైన పడిన మరకలను నిమ్మరసం వేసి నిమ్మ తొక్కతో రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మచ్చలు మాయమవుతాయి.
తెల్లటి నూలు వస్త్రాలపై తుప్పుమరకలు పడితే వాటిమీద నిమ్మరసం, ఉప్పు రాసి రెండు గంటలు ఎండలో ఉంచి ఆ తర్వాత ఉతకాలి.- నిమ్మతొక్కలతో రుద్దితే బట్టలమీద పడిన గోరింటాకు మరకలు పోతాయి.
- పేరుకున్న మురికిని వదిలించడానికి గట్టిగా బ్రష్‌తో రుద్దితే షర్టుకాలర్లు త్వరగా పాడవుతాయి. కాస్త షాంపువేసి నాననిచ్చి ఉతికి చూడండి మంచిగా వుంటాయి.
- దుప్పటి చివర్లు చినుగుతున్నట్లయితే కొత్త శాటిన్ బట్టను కొని దుప్పటి నాలుగు అంచులకు బోర్డర్‌లా వేసి కుడితే అది మళ్ళీ కొత్తదానిలా తయారవుతుంది.
- బట్టలపై సిరా మరకలు పోవాలంటే నిమ్మరసం కాని, పుల్లని పెరుగుకానీ ఆ మరకపై వేసి రుద్దండి. ఆ పైన ఉప్పుతో సిరా మరక పోయేంత వరకు రుద్ది ఉతికేయాలి.
- బట్టల్లో బొద్దింకలు చేరకుండా ఉండేందుకు కలరా ఉండలతో పాటు కర్పూరాన్ని కూడా ఉంచవచ్చు.
- బట్టలు నానబెట్టే ముందు ఆ నీళ్ళలో కాస్త వెనిగర్ ని కలిపితే బట్టలు రంగులు వెలిసి పోకుండా మెరుస్తూ ఉంటాయి.
- మీ పిల్లల వైట్ సాక్స్ బ్రౌన్ గా తయారయ్యాయా? నీటిలో రెండు లెమన్ స్లయిసెస్ వేసి ఆ నీటిలో ఈ సాక్సును వేసి నీటిలో బాయిల్ చేసి ఆ పైన ఉతకండి చాలు సాక్స్ తెల్లగా మెరిసిపోతాయి.
- మగవారి కోటు, ప్యాంటు గుండీలు సన్నటి నైలాన్ దారంతో కుడితే చాలా కాలం తెగకుండా ఉంటాయి.
- లెదర్ సోఫా పైన పిల్లలు క్రేయాన్స్ తో గీస్తే, వంటసోడా ఉప్పు కాస్త నీరు కలిపి పేస్టులా చేసి ఈ పేస్టుతో రుద్దితే మరక తొలగిపోతుంది.
narasaraopet, Laundry, gopikrishna laundry, GK laundry, నరసరావుపేట, Chilakaluripet
, చిలకలూరిపేట, narasaraopet, Laundry, gopikrishna laundry, GK laundry, నరసరావుపేట, Chilakaluripet, చిలకలూరిపేట, narasaraopet, Laundry, gopikrishna laundry, GK laundry, నరసరావుపేట, Chilakaluripet, చిలకలూరిపేట, narasaraopet, Laundry, gopikrishna laundry, GK laundry, నరసరావుపేట, Chilakaluripet, చిలకలూరిపేట, narasaraopet, Laundry, gopikrishna laundry, GK laundry, నరసరావుపేట, Chilakaluripet, చిలకలూరిపేట, narasaraopet, Laundry, gopikrishna laundry, GK laundry, నరసరావుపేట, Chilakaluripet, చిలకలూరిపేట, narasaraopet, Laundry, gopikrishna laundry, GK laundry, నరసరావుపేట, Chilakaluripet, చిలకలూరిపేట
No comments:
Post a Comment